అమెరికా వ‌ల్లే స‌మ‌స్య‌ల‌న్నీ - కిమ్

Dabbeda Mohan Babu
అగ్ర రాజ్యం అమెరికా కు ఉత్త‌ర కొరియా కు చాలా సంవ‌త్స‌రాల నుంచి మాట‌ల యుద్ధం న‌డుస్తునే ఉంది. ఉత్త‌ర కొరియా క్షిప‌ణులు ప్ర‌యోగించిన ప్ర‌తి సారి అగ్ర రాజ్యం అమెరికా ఖండిస్తు ఉంటుంది. అలాగే ప్ర‌పంచ వేదిక ల‌పై ఉత్త‌ర కొరియా చేసే ప‌నులను నిల‌దీస్తుంది. దీంతో ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్ర‌తి సారి అగ్ర రాజ్యం పై నిప్పులు చేరుగుతాడు. ఈ రెండు దేశాల మ‌ధ్య ఉండే మాటల యుద్ధాల వల్లే త్వ‌ర‌లోనే మూడో ప్ర‌పంచ యుద్ధం రావ‌చ్చు అని ప్ర‌పంచ మేధావులు కూడా ప‌లు సార్లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అయితే అమెరికా అధ్య‌క్షునిగా ట్రంప్ ఉన్న స‌మ‌యంలో ఈ ఉద్రిక్త‌త‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. ట్రంప్ కిమ్ జోంగ్ ఉన్ కొన్ని సార్లు ప్ర‌త్యేక్షంగా కూడా క‌లుసుకుని కొన్ని స‌మ‌స్య ల‌ను ప‌రిష్క‌రించుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారి పొయింది. అమెరికా కు బైడెన్ అధ్య‌క్షుడిగా వ‌చ్చిన నాటి నుంచి అమెరికా తో ఉన్న స్నేహం విష‌యం లో కిమ్ జోంగ్ ఉన్ యూట‌ర్న్ తీసుకున్నారు. అప్ప‌టి నుంచి ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ స‌మ‌యం వ‌చ్చిన ప్ర‌తి సారి అగ్ర రాజ్యం అమెరికా పై సంచల‌న ఆరోప‌ణ‌లు చేస్తాడు. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ మ‌రో సారి అమెరికా పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కొరియా ద్విప‌క‌ల్పంలో ఉద్రిక్త‌త‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అమెరికా నే అని ఆరోపించారు. అందుకే కొరియా దేశాల మ‌ధ్య శ‌త్రువ్వాలు పెరిగాయ‌ని అన్నారు. కానీ ఇప్ప‌టి నుంచి అమెరికా కు లొంగేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అమెరికా తో స‌హా శ‌త్రు దేశాల‌ను ధీటు గా ఎదుర్కోవ‌డానికి తాము ఆధునిక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటామ‌ని అన్నారు. అలాగే ద‌క్షిణ కొరియా తో యుద్ధాలు ఉండబోవ‌ని తెలిపారు. త‌మ మ‌ధ్య స్నేహం చిగురిస్తుంద‌ని అన్నారు. కిమ్ అమెరికా పై చేసిన తాజా వ్యాఖ్య ల‌తో రెండు దేశాల మ‌ధ్య మ‌రోసారి ఉద్రిక్త‌త పరిస్థితులు నెల‌కొన్నాయి. అయితే కిమ్ చేసిన ఆరోప‌ణ‌ల పై అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: