క‌రోనా టెస్ట్ కు బిల్ 40 ల‌క్ష‌లు ఎక్క‌డో తెలుసా?

Dabbeda Mohan Babu
క‌రోనా వైర‌స్ వ్యాప్తి స‌మ‌యాల్లో ప్ర‌యివేటు ఆస్ప‌త్రిల్లో ఫీజుల దోపిడి విప‌రీతంగా ఉండేది. ఒక సామ‌న్యడు ఒక ప్ర‌యివేటు ఆస్ప‌త్రి కి వెళ్లి కొవిడ్ కు చికిత్స తీసుకుంటే బిలు కంట‌డానికి త‌న ఆస్తులు అమ్ము కోవాల‌ని అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో మీమ్స్ కూడా వ‌చ్చాయి. ఇలాంటి ఫీజుల‌ను అరిక‌ట్టాల‌ని ప్ర‌భుత్వాలు కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్న క్షేత్ర స్థాయిలో మాత్రం అమ‌లు కు నోచు కోలేదు. ఈ ఫీజ‌ల దోపిడి కేవ‌లం మ‌న దేశం లోనే కాదు. చాలా దేశాల్లో జ‌రిగింది. ఇలాంటి ఘ‌ట‌న నే అమెరికా దేశంలో చోటు చేసుకుంది. క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష చేసుకున్న వ్య‌క్తి కి వాటి ఫ‌లితం క‌న్న‌.. ఆ టెస్టు కు ఆ ప్రయివేటు ఆస్ప‌త్రి వారు వేసిన బిల్లు ను చూసి షాక్ అయ్యాడ‌ట‌.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న సంద‌ర్భంలో అమెరికా దేశంలో ఉన్న టెక్సాస్ న‌గ‌రానికి చెందిన ట్రావిన్ వార్న‌ర్ అనే వ్య‌క్తి లెనిన్ విల్లే లోని ఒక ప్ర‌యివేటు ప‌రీక్ష కేంద్రంలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేసుకున్నాడు. మొద‌ట‌ త‌న‌కు కరోనా వైరస్ పాజిటీవ్ వ‌స్తుందో మో అని భ‌య‌ప‌డ్డాడు. కానీ ఆ ప్ర‌యివేటు ప‌రీక్ష కేంద్రం వారు వేసిన బిల్లు ను చూసి షాక్ అయ్యాడ‌ట‌. ఈ ప‌రీక్ష కేంద్రంలో తాను చేసుకున్న యాంటీజెన్ ప‌రీక్ష తో  పాటు ఫెసిలిటీ ఫీజ్ కింద 54000 డాల‌ర్లు బిల్లు చేశార‌ట‌. అంటే మ‌న ఇండియా క‌రెన్సిలో దాదాపు రూ. 40 ల‌క్ష‌లు అన్న‌మాట‌. ఇంత బిల్లు ను చూసి ట్రావిన్ వార్న‌ర్ షాక్ తిన్నాడ‌ట‌. అయితే అమెరికా లో సాధార‌ణంగా పీసీఆర్ టెస్ట్ కు 8 నుంచి 15 డాల‌ర్ల వ‌ర‌కు తీసుకునే వారు. కానీ గ‌త నెల నుంచి అమెరికా లో క‌రోన వైర‌స్ వ్యాప్తి ఎక్కువ గా ఉండ‌టంతో మ‌ళ్లి ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచేసారు.  మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: