పాడుపనిచేసి దేశబహిష్కరణకు గురైన ఎన్నారై..?

Suma Kallamadi
భారతీయులు అమెరికాకు వెళ్తున్నారంటే.. మంచిగా చదువుకోడానికో లేదా ఉద్యోగం చేయడానికో వెళ్తున్నారని అందరూ భావిస్తుంటారు. నిజానికి అమెరికాకు వెళ్ళే 99%  భారతీయులు మన దేశానికి మంచి పేరు తెచ్చిపెడుతుంటారు. కానీ మిగిలిన వారు మాత్రం మోసాలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతూ యావత్ భారతదేశానికి చెడ్డపేరు తెస్తున్నారు. ప్రదీష్ జెహాన్ సెల్వరాజ్ అనే వ్యక్తి చేసిన నీచమైన పనికి ప్రస్తుతం సాటి భారతీయులు తలదించుకుంటున్నారు. అమెరికా దేశానికి వెళ్లిన ప్రదీష్ జెహాన్ ఒమాహాలో నివసించేవాడు. ఆ సమయంలో అతడు చిన్నారులపై లైంగిక వాంఛ తీర్చుకోవాలని ప్రయత్నించాడు. గతేడాది అక్టోబర్ 26 - నవంబర్ 4 మధ్యకాలంలో పదిహేనేళ్ల బాలికను ట్రాప్ చేయడానికి ప్రదీష్ అనేక సార్లు ప్రయత్నం చేశాడు.



ఒకానొక రోజు ప్రదీష్ ఆన్‌లైన్‌లో ఒక ప్రాస్టిట్యూషన్ ప్రకటనను చూసి స్పందించాడు. అడ్వర్‌టైజ్‌మెంట్‌లో ఇచ్చిన ఒక ఫోన్ నెంబర్ కి కాల్ చేసి పదిహేనేళ్ల బాలికతో పాటు 12 ఏళ్ల బాలికతో ఓరల్‌ సెక్స్ కావాలని కోరాడు. అలాగే 80 డాలర్లు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒమాహాలో ఒక ప్రదేశానికి బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చి బాలికలకు ఇస్తానని.. తరువాత వారిని తనతోపాటు తీసుకెళతానని చెప్పాడు.


అయితే ప్రదీప్ ముందుగా చెప్పిన ప్రాంతానికి బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చాడు కానీ అక్కడ మైనర్ బాలిక ఎవరూ కనిపించలేదు. దాంతో అతడు అక్కడినుంచి వెళ్ళిపోతుండగా అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికలపై సెక్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్న వ్యక్తులను పట్టుకోడానికి అమెరికా పోలీసులే నకిలీ అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇచ్చారు. అది నిజమే అనుకొని ప్రదీప్ అక్కడి పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతడి వద్ద కండోమ్స్ కూడా దొరికాయి. దాంతో అతడిపై సంబంధిత కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.

అమెరికా న్యాయ స్థానం చైల్డ్ సెక్స్ ని తీవ్రంగా పరిగణించి ప్రదీష్‌కు ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఐదేళ్ల పాటు పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఉండాలని ప్రదీష్‌ను ఆదేశించింది. సెక్సువల్ అపరాధిగా ఇతన్ని పరిగణించాలని.. జైలు శిక్ష అనుభవించిన అనంతరం ప్రదీష్‌ను యూఎస్ నుంచి బహిష్కరించాలని వెల్లడించింది. ప్రదీష్‌ను తిరిగి సొంత దేశానికి పంపించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: