మహిళగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా: ఇండో-అమెరికన్ శాస్త్రవేత్త
నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో పని చేసేందుకు ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రతిభావంతులు వస్తారు. విభిన్న సంస్కృతుల నుంచి చాలా మంది వస్తారు కాబట్టి ఇక్కడ దేశ, జాతి వివక్షతకు ఆస్కారం ఉండదని ఆమె స్పష్టం చేశారు. కొన్ని సందర్భాలలో భారత సంస్కృతుల గురించి తెలుసుకోలేని కొందరు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. అటువంటి వ్యక్తులకు ఇండియన్ సంస్కృతి పట్ల ఎలాంటి గౌరవం ఉండదు. అప్పుడు వర్క్ స్పేస్ లో ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె చెప్పుకొచ్చారు. మార్స్ 2020, జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ లలో చాలామంది ఇండో-అమెరికన్లు, భారతీయులు పనిచేస్తున్నారని ఆమె తెలిపారు.
ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తన భర్త తనకు ఎంతో సపోర్ట్ చేస్తారని వెల్లడించారు. చిన్నతనంలోనే డాక్టర్ కావాలని తాను అనుకున్నట్లు.. ఆ గోల్ ప్రకారమే తాను ఎంతో కష్టపడి డాక్టర్ అయినట్ట చెప్పారు. అయితే అంతరిక్షం పై తనకు ఆసక్తి ఉందని ఆ ఆసక్తి తోనే స్పేస్ గురించి చదువులు చదివి నాసాలో ఉద్యోగం సాధించానని ఆమె అన్నారు. అవకాశాలు ఊరికే రావు అని మనమే క్రియేట్ చేసుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. భారతీయ ఆహారం అంటే తనకు ఎంతో ఇష్టమని.. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. అమెరికాలో కూడా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయని.. దాంతో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.