దారుణంగా మోసపోయిన 8 మంది భారతీయులు .. ఎట్టకేలకు..!

Suma Kallamadi
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు కాజేస్తున్న కేటుగాళ్లు ఎక్కువైపోయారు. ఈ మోసగాళ్ల చేతుల్లో బాధితులై విదేశాల్లో బిక్కుబిక్కుమంటూ గడిపే అమాయకుల సంఖ్య కూడా పెరిగిపోయింది. గడిచిన ఏడాది సమయంలో ఇటువంటి కేసులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా మరొక మోసం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. ఒక ఫేక్ ఏజెన్సీ ఎనిమిది మంది వ్యక్తుల నుంచి 5వేల దిర్హమ్‌లను వసూలు చేసి.. దుబాయిలోని షార్జా సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. దీంతో మార్చి నెలలో 8 మంది భారతీయులు దుబాయ్ కి వెళ్లి షార్జాలో ఫేక్ ఏజెన్సీ చెప్పిన ప్రకారం ఉద్యోగాల కోసం వెతికారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అటువంటి ఉద్యోగాలు ఏమీ లేవని తెలిసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఫేక్ ఏజెన్సీ ప్రతినిధులు పాస్‌పోర్ట్‌లను కూడా తిరిగి తీసుకోవడంతో తాము నిలువునా మోసపోయామని గ్రహించిన సదరు భారతీయులు స్వదేశానికి తిరిగి రాలేక నానా ఇబ్బందులు పడ్డారు.
అయితే వారి అవస్థలను గ్రహించిన స్థానిక మీడియా కథనాలను ప్రచురించింది. అయితే ఈ వార్తా కథనాలు ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం దృష్టికి వచ్చాయి. దీనితో ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం అధికారులు లోకల్ సోషల్ కార్యకర్తల సహాయంతో ఎనిమిది మంది భారతీయులకు వసతి కల్పించారు. అలాగే ఎనిమిది మంది తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు అరేంజ్ చేశారు. దీంతో ఎట్టకేలకు ఈ ఎనిమిది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో కాన్సులేట్ కార్యాలయం అధికారులు నిరుద్యోగులను హెచ్చరించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మనుషులను అసలు నమ్మకండి.. ఉద్యోగ ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండండి అని వ్యాఖ్యానించారు. ఉద్యోగ ప్రకటనలను నమ్మితే కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టుకోవడమే కాదు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా ప్రవాసీ భారతీయ సహాయత్ కేంద్ర (పీబీఎస్కే) యాప్ ద్వారా ఏజెంట్లు ఉద్యోగాల గురించి చెప్పే విషయాలలో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: