అమెరికా: భారతీయ విద్యార్థుల సమస్య తీరనుందా..?

Suma Kallamadi
ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఆమోదించబడని కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న విద్యార్థులను మళ్లీ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అమెరికా విద్యా సంస్థలు కరాఖండిగా తేల్చి చెబుతున్నాయి. ఆగస్టు నెలలో సెమిస్టర్ పరీక్షలు జరగనుండగా.. అమెరికా ప్రభుత్వం పాస్ పోర్టులు సమర్పించడంలో తీవ్ర విముఖత చూపుతుంది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన భారతదేశంలో తయారైన టీకాలలో కేవలం ఒక్క టీకా (కొవిషీల్డ్‌) మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం పొందింది. అది కూడా ఎమర్జెన్సీ యూస్ కోసమే ఆమోదం పొందింది. ఇక భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకా, రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఆమోదించబడలేదు.

అయితే ఈ రెండు టీకాలను అభివృద్ధి చేసిన కంపెనీలు ఏప్రిల్ నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ను ఆశ్రయించి.. తమ టీకాలకు సంబంధించిన ట్రయల్స్ సమాచారం పొందుపరిచి ఆమోదించాలని కోరాయి. అయితే మరింత సమాచారం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. దీంతో ఈ టీకాలను తీసుకున్న వారిని అనుమతించడానికి అమెరికాలోని కొన్ని విద్యాసంస్థలు వ్యతిరేకత చూపుతున్నాయి. సమర్థవంతమైన టీకాలు తీసుకున్న తర్వాతనే తమ క్యాంపస్లలో అడుగుపెట్టాలని యూనివర్సిటీలు కఠిన నిబంధనలు పెట్టాయి.


అయితే తాజాగా ఈ విషయం భారత కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా రంగంలోకి దిగి భారతీయ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను అమెరికా ఉన్నత అధికారులకు వివరించారు. ఆయన భారతీయ-అమెరికా దేశాల మధ్య ఉన్న సంబంధాలను కూడా గుర్తు చేశారని తెలుస్తోంది. భారతదేశంలోని కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, కరోనా జయించడానికి అందించాల్సిన సహాయ సహకారాలు గురించి విదేశాంగ కార్యదర్శి అమెరికా అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఐతే ఇండియన్ విద్యార్థుల సమస్యను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అమెరికా తాత్కాలిక రాయబారి డేనియల్ స్మిత్ హామీ ఇచ్చారు. అయితే అసమర్థమైన టీకా తీసుకున్న వారిని అనుమతిస్తే అమెరికా ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్లే అవుతుందని అక్కడి ప్రభుత్వం ఇంకా ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: