తెలుగువారికి అమెరికాలో ఉద్యోగ అవకాశాలు..!

Suma Kallamadi
తెలుగు భాషోద్యమ సంస్థ తెలుగు కూటమి తానా కి అధ్యక్షుడైన తాళ్లూరి జయశేఖర్‌ ప్రతి సంవత్సరము లక్ష రూపాయలు విరాళం గా అందిస్తానని ప్రకటించారు. 'తెలుగు కూటమి' భాషోద్యమ సంస్థ ఏర్పాటుచేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా 'రచ్చబండ ఊసులు' పేరిట ఆన్‌లైన్‌ లో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జయశేఖర్‌ మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు కూటమి కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. తన తండ్రి తాళ్లూరి పంచాక్షరయ్య పేరిట విరాళాన్ని అందిస్తానని ఆయన ప్రకటించారు.


అమెరికా దేశం లో వేగంగా విస్తరిస్తున్న అన్ని భాషల్లో తెలుగు భాష ముందు వరుసలో నిలుస్తోందని, దీనివల్ల భవిష్యత్తులో తెలుగు భాష అనర్గళంగా వచ్చిన వారికి అమెరికాలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. తానా సంస్థ తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు 50 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తోందని... తానా పాఠశాల ఆధ్వర్వంలో 'ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు' కార్యక్రమం ద్వారా పదివేలకు పైగా బయటి రాష్ట్రాల విద్యార్థులు తెలుగు భాష నేర్చుకుంటున్నారని ఆయన వెల్లడించారు.


ఇకపోతే 'తెలుగు కూటమి' ని ఏర్పాటు చేసిన కోదండరామయ్య కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. తెలుగులో నామఫలకాలు రాయించిన వారికి 5 వేల రూపాయలు తన తరఫున ఇస్తామని ఆయన ప్రకటించారు. ఒక మంచి ఉద్యమ గీతానికి అక్షరాల 1000 రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించారు. తెలుగు నినాదానికి 500 చొప్పున ఇస్తామని కోదండ రామయ్య వెల్లడించారు. బిజినెస్ కంపెనీలు తమ ప్రోడక్ట్స్ కి సంబంధించిన వివరాలను అచ్చ తెలుగు లోనే ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, దీనివల్ల తెలుగు భాష నేర్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలుగు టెక్నాలజీ నిపుణుడు వీవెన్‌ వెల్లడించారు.


అమెరికా దేశంలో కూడా తెలుగు భాష వేగంగా విస్తరించడం ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయో అమెరికాలో కూడా త్వరలోనే తెలుగు రాష్ట్రాలు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా తెలుగు భాష పరిరక్షణ కొరకు చాలామంది కృషి చేయడం ప్రశంసనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: