ఇండియాకు బిడెన్ గుడ్ న్యూస్...?

Gullapally Venkatesh
అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా భారత్ తో కొన్ని దేశాలు దూరం పాటిస్తున్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొన్ని దేశాలు మన దేశం విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నాయి అని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం దిశగా అమెరికా అధ్యక్షుడు అడుగులు వేస్తున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
ముఖ్యంగా భారతీయులను అమెరికా ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. గత ఐదేళ్ళ కాలంలో చాలా వరకు అమెరికా నష్టపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ట్రంప్ విధానాల వలన అమెరికాలో ఉండాలి అనుకున్న చాలా మంది ఐటీ నిపుణులు ఇతర దేశాలకు వెళ్లి పోయిన పరిస్థితులు ఉన్నాయి. మన దేశం నుంచి వెళ్లి అమెరికాలో ఐటీ రంగాన్ని బలోపేతం చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద ఆధార పడే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా సరే భారతీయులను అమెరికా తీసుకువెళ్లే ఆలోచనలో ఆ దేశ అధ్యక్షుడు ఉన్నారని అంటున్నారు.
 భారతీయులు చాలామంది ట్రంప్ విధానాల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. బిడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత చాలామంది భారతీయులను తమ బృందంలో కూడా నియమించుకున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాయి. దాదాపు 55 మంది ఆయన బృందంలో కీలక పదవుల్లో ఉన్నారు. ఆయన ప్రసంగాలు రాసే వ్యక్తి కూడా భారతీయుడే కావడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ కు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పాలి. మరి ఆయన త్వరలో భారతీయుల కోసం తీసుకునే నిర్ణయం ఏంటి అనే దానిపై ఆసక్తికరంగా చర్చలు జరుగుతున్నాయి. భారతీయ విద్యార్థుల కోసం కూడా ఆయన త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: