మోడీని వదనలని ట్రంప్
అయితే ట్రంప్ ఓటమి పాలైనా సరే మోడీతో స్నేహం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఏంటీ అనేది చూస్తే... గుజరాత్ లో ఆయన వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అల్లుడు జారెద్ కుష్ణర్ సారధ్యంలో ఒక కంపెనీని గుజరాత్ రాజధానిలో స్థాపించే ప్రయత్నం చేస్తున్నారు అని సమాచారం. దీనికి సంబంధించి ట్రంప్ కుమార్తె, అల్లుడుతో కలిసి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆయన వచ్చే నెల చివర్లో పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే ఎప్పుడు వస్తారు అనే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. ఇక ట్రంప్ ఇప్పటికే భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. రష్యాలో కూడా ట్రంప్ కి భారీగా వ్యాపారాలు ఉన్నాయి. భారత్ లో మరిన్ని వ్యాపారాలను పెంచుకునే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు అని పరిశీలకులు అంటున్నారు.ఇక చైనాలో ఆయన తన వ్యాపారాలను ముగించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే మళ్ళీ మోడీ గనుక ట్రంప్ తో స్నేహం చేస్తే బిడెన్ దూరమయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.