భారతీయ మహిళలకు బిడెన్ ప్రాధాన్యం
ఆయన దూకుడుగా ఉండే నేత కాదు అనే విషయం ప్రపంచానికి ఇప్పటికే స్పష్టంగా అర్ధమైన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఆయన ఎలా వ్యవహరిస్తారు అనేది క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చిన మహిళలకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. తన ప్రభుత్వంలో ఎక్కువగా మహిళా మంత్రులకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత్ నుంచి ఇప్పటికే కమలా హారిస్ ని ఉపాధ్యక్షురాలి గా ఎంపిక చేసారు. ఇక ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా భారతీయురాలినే ఎంపిక చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.
దీనికి సంబంధించి ఇప్పుడు కాస్త చర్చలు జరుగుతున్నాయి. ఇక చైనా నుంచి వెళ్ళిన ఒక మహిళకు కూడా ఆయన బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. బిడెన్ ని ట్రంప్ కూడా అధ్యక్షుడిగా అంగీకరించారు. తాను ఓడిపోయాను అని ట్రంప్ నిర్ధారణకు వచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బిడెన్ మంత్రి వర్గం విషయంలో కాస్త ఎక్కువగా కసరత్తులు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఆయన ఎలా వ్యవహరిస్తారు ఏంటీ అనేది చూడాలి. ఇక మన దేశం కూడా బిడెన్ వైఖరి మీద ఆసక్తిగా గమనిస్తుంది. మరి బిడెన్ ఎంత వరకు సమర్ధవంతంగా పని చేస్తారో చూడాలి. ఒబామా సలహాలతో ఆయన ముందుకు అడుగు వేసే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు.