ఉద్యోగాలకు దండం పెట్టేస్తున్న ఎన్నారైలు...?

Gullapally Rajesh
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ కూడా చాలా వరకు నష్టపోయారు. దీనితో ఇప్పట్లో పరిస్థితులు మెరుగుపడే అవకాశం స్పష్టంగా  లేదు అనే విషయం... చాలా స్పష్టంగా చెప్పవచ్చు. చాలా వరకు కూడా వ్యాపారంలో నష్టం రావడంతో ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు. అమెరికా సహా యూకే చైనా వంటి దేశాల్లో చాలా వరకు ఉద్యోగుల తొలగింపు పనులు జరుగుతూ వస్తున్నాయి. దీనిపై విమర్శలు వస్తున్నా నష్టాలను భరించలేక ఇప్పుడు కంపెనీలు ఉద్యోగం చేసే వారిని తీసేసే పరిస్థితులు వచ్చాయి అనే మాట వాస్తవం.

దీనిపై ఉద్యోగులలో కూడా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్ర దేశాలు అయిన అమెరికా యుకె యూరప్ లోని కొన్ని దేశాల్లో ఇప్పుడు ఉద్యోగస్తులను తొలగించడంతో వారందరూ కూడా ఇప్పుడు వ్యాపారాలు మెరుగు అనుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారందరూ కూడా భారత్ సహా కొన్ని దేశాల్లో వ్యాపారం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చేసే భారత్ లో వ్యాపారాలు చేసుకోవడం మంచిది అనే నిర్ణయానికి ఇప్పుడు ఎన్నారైలు వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ పేరుతో స్వదేశీ వస్తువులను ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తోంది.

దీనితోనే ఇప్పుడు దేశంలోకి వచ్చే స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచనలో చాలా వరకు ఎన్నారైలు ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది రోడ్ల మీద పడిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు తిరిగి వస్తాయి అనే విషయం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నిక అయితే మాత్రం విదేశీయులకు ఈసారి కాస్త గడ్డు కాలమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో ఏమవుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: