ట్రంప్ "ప్రధమ మహిళ" కి కరోనా పరీక్షలు...అప్రమత్తమైన శ్వేతసౌధం

frame ట్రంప్ "ప్రధమ మహిళ" కి కరోనా పరీక్షలు...అప్రమత్తమైన శ్వేతసౌధం

NCR

ప్రపంచానికి ముర్చెమటలు పట్టిస్తున్న కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే కరోనా మరణాలు 600 లకి పైచీలుకి చేరుకోగా సుమారు 50000 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే కరోనా తీవ్రత అమెరికాలో ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ట్రంప్ సతీమణి మెలానియా కరోనా పరీక్షలు చేయించుకోవడం ఇప్పుడు అమెరికాలో చర్చనీయంసం అయ్యింది. అయితే

IHG

ట్రంప్ కి మార్చి 13 వ తేదీన కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ట్రంప్ కి కరోనా నెగిటివ్ వచ్చిందని ప్రకటించారు. అయితే ట్రంప్ భార్య మెలానియా పరీక్షల ఫలితాలు అప్పుడు వెల్లడించలేదు. దాంతో మెలానియాకి కరోనా సోకిందా అంటూ అందరూ ఆందోళన  వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం శ్వేతా సౌధం అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో కరోనా సోకిన వ్యక్తులు వైట్ హౌస్ లో ఉన్నారని అందరూ భావించారు..కానీ

IHG

తాజాగా అమెరికా ప్రధమ మహిళ మెలానియా కి కరోనా లేదంటూ రిపోర్ట్ లో నెగిటివ్ వచ్చిందని వైట్ హౌస్ సిబ్బంది తేల్చి చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెలానియా ఆరోగ్యం అంతా బాగుందని తనకి ఎలాంటి కరోనా లేదని ట్రంప్ స్వయంగా ప్రకటించడంతో కొన్ని రోజులుగా ఏర్పడిన ఉత్ఖంటకి తెరపడినట్టు అయ్యింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: