కెనడా ఎన్నికల్లో " ఏపీ ఎన్నారైల" సత్తా...!!!!

NCR

ప్రపంచ నలుమూలలా తెలుగు వారు ఎంతో మంది స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. కొన్నేళ్లుగా అక్కడే స్థిరపడిపోయి అక్కడి ప్రజలకి ఎంతో దగ్గరైన వాళ్ళు ఎన్నో లక్షల కుటుంభాలు ఉన్నాయి.. వివిధ రంగాలలో భారతీయులు తమ ప్రతిభని ఎప్పటికప్పుడు కనబరుస్తూనే ఉన్నారు. ఆయా దేశాల రాజకీయ వ్యవహారాలలో సైతం భారతీయులు ఉన్నత శిఖరాలని చేరుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

 

అయితే తాజాగా కెనడాలో తెలుగు ఎన్నారైలు అక్కడి అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని ఆధిక్యతతో దూసుకుపోయారు.  గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడికి చెందిన ప్రసాద్‌ పాండా , విజయనగరం కి చెందిన లీలా అహీర్‌ యునైటెడ్‌ కన్జర్వేటివ్‌ పార్టీ ,తరపున విజయ పతకం ఎగురవేశారు.

 

ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల కావడం ఇది వరుసగా రెండోసారి. ఈ నెల 16న అల్బెర్టా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  87  స్థానాల అసెంబ్లీలో యూసీపీ 64 సీట్లు గెలిచి అధికారం చేపట్టనుంది. పార్టీ అధ్యక్షుడు జాసన్‌ కెన్నీ ముఖ్యమంత్రి కానున్నారని తెలుస్తోంది. విజయనగరం వాసి అయిన లీల ఎడ్మంట్‌లో జన్మించారు. గత జనవరిలోనే ఆమె విజయనగరం కూడా సందర్శించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: