షాకింగ్.."అమెరికాకి" తగ్గుతున్న "భారత విద్యార్ధుల వలసలు"

Bhavannarayana Nch

ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎంతో మంది విద్యార్ధులు అనేక దేశాలనుంచీ నుంచీ అమెరికా వెళ్తూ ఉంటారు..అలాంటి వారిలో ఎక్కువగా భారతీయులే ఉంటారు..అయితే గత సంవత్సర కాలంతో పోల్చుకుంటే ఎప్పటికంటే కూడా విద్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అంటున్నారు నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికా పాలసీ సర్వే సంస్థ.. 2016 - 2017 మధ్యకాలంలో 21శాతం తగ్గిందని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికా పాలసీ (ఎన్‌ఎఫ్ఏపీ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.

 

యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ఇచ్చిన తగా సమాచారం ప్రకారం..ఎన్‌ఎఫ్ఏపీ ఈ వివరాలు వెల్లడించింది. ఇతర దేశాల నుంచి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవటానికి వచ్చే వారి సంఖ్య కూడా 2016-2017 మధ్యకాలంలో 4శాతం తగ్గిందని తెలిపింది. దీనిలో భారత్ నుంచి వచ్చి కంప్యూటర్‌ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులే అధికంగా ఉన్నారని తెలిపింది.. భారత్ నుంచి వచ్చే విద్యార్థులే అమెరికా‌ కంపెనీలకు ప్రధాన మానవ వనరులుగా ఉంటున్నారు.

 

అయితే అమెరికాకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తీసుకొచ్చిన కటిన వీసా విధానం మరియు వర్క్‌ నిబంధనలే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు కారణం అని ఈ సంస్థ తెలిపింది..అంతేకాదు పెద్దనోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు కొరతా కొంతవరకూ ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది...భారత విదేశీ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 2017లో 2,06,708 మంది విద్యార్థులు మాత్రమే గ్రాడ్యుఏషన్ లో వెళ్ళారని తెలుస్తోంది..అయితే ఈ లెక్క గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎంతో తక్కువగా ఉందనదే ఈ సంస్థ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: