12 ఏళ్ల కుర్రాడి.. 4వేల‌ కిలోమీట‌ర్ల సాహ‌స‌యాత్ర‌

Shyam Rao

ఒక బాలుడు త‌న వ‌య‌సుకు మించిన సాహ‌సాన్ని చేయాల‌నుకున్నాడు. ప్రపంచంలోనే ఆర‌వ పెద్ద‌దేశ‌మైన ఆస్ట్ర్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ రాష్ల్రంలోని కెండాల్ గ్రామం నుంచి పెర్త్ న‌గ‌రాన్ని చేరుకునేందుకు కారులో బ‌య‌లుదేరాడు. సుమారు 4,000 కి.మీ. ల దూరం ఒంట‌రిగా ప్ర‌యాణించాల‌ని అత‌డు నిర్ణ‌యించుకున్నాడు. అయితే అత‌డు 25,00 కి.మీ. లు చేరుకోగానే పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. అంత‌కంటే ముందు మామూలుగా హైవే పెట్రోలింగ్ పోలీసులు వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు. అందులోభాగంగా ఆ కుర్రాడు ప్ర‌యాణిస్తున్న కారును కూడా ఆపారు. కారులో ఒక్క‌డే ప్ర‌యాణిస్తుండ‌టంతో పోలీసులు అత‌డిని ప్ర‌శ్నించారు.



అత‌డు చెప్పిన స‌మాధానం విని వారు ఆశ్చ‌ర్య‌పోయారు. ఇంత‌కీ అత‌డేం చెప్పాడంటే, తూర్పు ఆస్ట్రేలియాలోని కెండాల్ గ్రామం నుంచి ప‌శ్చిమ చివ‌రి ప్రాంత‌మైన పెర్త్ వెళ్తున్నాన‌ని చెప్పాడు. మార్గ‌మ‌ద్యంలో ఉన్న‌ బ్రోకెన్ హిల్ ప‌ట్ట‌ణాన్ని చేరుకోవ‌డానికే అత‌డికి సుమారు 14 గంట‌లు ప‌డుతుంది. మొత్తం ప్ర‌యాణించ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. అలాంటి ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు ఒంట‌రిగా వెళ్ల‌కూడ‌ద‌ని, పైగా 12 ఏళ్ల కుర్రాడు ఒంట‌రిగా అంత‌దూరం కారులో వెళ్ల‌డం త‌ప్ప‌ని పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. ఎవ‌రైన సుదూర ప్ర‌యాణాలు చేయాల‌నుకుంటే స‌రిప‌డ ఆహరం, నీరు, పెట్రోల్ వెంట తీసుకెళ్లాల‌ని పోలీసులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: