ఉత్సాహంగా టీసీఎస్‌ఎస్ బాడ్మింటన్ టోర్నమెంట్...!!
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో స్పోర్టిస్‌వుడేలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2016 ఉత్సాహంగా సాగింది. సమన్వయకర్తలు గరేపల్లి శ్రీనివాస్, ఆర్‌సీ రెడ్డి, గార్లపాటి లక్ష్మారెడ్డి, దుర్గాప్రసాద్ మంగలిల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలతోపాటుగా, ఇతర క్రీడాకారులు టోర్నీలో పాల్గొన్నారు. మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలను సొసైటీ అధ్యక్షులు బండ మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌కుమార్, ఉపాధ్యక్షులు బూర్ల శ్రీనివాస్, పెద్ది చంద్రశేఖర్‌రెడ్డి, ముదాం అశోక్, కార్యవర్గసభ్యులు యెల్లా రాంరెడ్డి, చిల్క సురేశ్, అల్లసాని కృష్ణారెడ్డి, మహేశ్, నల్ల భాస్కర్‌లు పర్యవేక్షించారు. టోర్నీ విజయానికి తోడ్పాటునందించిన వంశీధర్ జానిక్, రవికుమార్ నీరుడులకు సొసైటీ కార్యవర్గ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.