బాలీవుడ్ స్ర్కీన్ కలర్ ఫుల్ గా మారబోతోంది. దీపావళి సందర్భంగా రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. సన్నాఫ్ సర్ధార్-జబ్ తక్ హై జాన్.. రెండు సినిమాలు పోటాపోటీగా విడుదలవుతుండటం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లలో ఎవరికి వారు తమ చిత్రందే పై చేయి అవుతుందని భావిస్తున్నాయి.
అజయ్ దేవ్ గన్, సోనాక్షిసిన్హా జంటగా తెరకెక్కిన సన్నాఫ్ సర్దార్ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అజయ్ దేవ్‌గణ్ జోడు గుర్రాలపై చేసే విన్యాసాలు, సోనాక్షి సిన్హా బైక్ నడపడం, సోనాక్షి సిన్హా తండ్రి పాత్ర ధరించిన సంజయ్‌దత్ జీప్లను సునాయాసంగా నడిపిన తీరు ఈ సినిమాకు హైలెట్స్ గా చెప్పుకోవచ్చు. సునీల్ సైకిల్ విన్యాసాలతో రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన 'మర్యాద రామన్న'కి రీమేక్ గా 'సన్నాఫ్ సర్ధార్' చిత్రం తెరకెక్కింది. 50 కోట్ల బడ్జెట్ తో పంజానీ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
సన్నాఫ్ సర్ధార్ కు పోటీ రాబోతున్న చిత్రం 'జబ్ తక్ హై జాన్'. యశ్‌చోప్రా దర్శకత్వంలో షారూఖ్‌ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా రూపొందిన ఈ మూవీ కూడా దీపావళికే విడుదలవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్ షారూఖ్-కత్రీనా జంటగా నటించిన ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ రెండు సినిమాల రిజల్ట్ లపై బెట్టింగ్‌లు కూడా జోరుగా సాగుతున్నట్టు బాలీవుడ్ సమాచారం.
మరింత సమాచారం తెలుసుకోండి: