డ్రగ్స్ వల లో టాలీవుడ్ ?

డ్రగ్ రాకెట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఎన్ని సార్లు సిని ప్రముఖులు డ్రగ్ సరఫరా చేస్తు పోలీస్ లకు పట్టు బడినా షరా మామూలే గా అంటు, డ్రగ్ వ్యాపారం దాని పని ఆది చాప క్రింద నీరు లా చేసుకుంటు పొతుంది.  డ్రగ్ వాడకం దార్లు ఎంత మంది ఉన్నారు? వీరికి డ్రగ్ సప్లయ్ చేసే ధీరులు ఎంత మంది? వీరికి కొమ్ము కాసే వారు ఎవరు? అన్న ప్రశ్న మాత్రం పెద్దింటోళ్ల బాగోవతం పెరుమాళ్ళుకేరుక లా మారింది.  వారి సోషల్ స్టేటస్ తో పాటు రాజకీయ బ్యాగ్రౌండ్ ఉండటం వల్ల చిక్కిన వారు, వారితో పాటు మిగిలిన వాళ్లు తప్పించుకుంటున్నారు. పట్టుబడిన వారి దగ్గర దొరికిన ఫోన్ లో ఉన్న నెంబర్లు ల ద్వారా ఫోలీస్ లు అందరూ జాతకాలు బయట పెట్ట వచ్చు కాని అది జరిగే పని కాదు. ఎక్కడ పరిశ్రమకు ఉన్న కాస్త పరువు పోతుందని పెద్దలు కలసి కట్టుగా బాదితులను అదుకుంటారు.  డ్రగ్ జాఢ్జ్యం వల్ల యువత తమ భవిష్యత్ ను కొందరు స్వార్థ పరుల వల్ల నాశనం అవుతుందని గ్రహించడం లేదు. డ్రగ్స్  పట్టు బడ కొన్ని రోజులు పాటు అందరూ చేప్ప కుంటారు తరువాత అంతా షరా మాములే. పోలీస్ లకు ఏవరి ముడుపులు వారికే అందుతాయి.  డ్రగ్ రాకెట్ లో దొరికే వారు ఉత్సవ విగ్రహలే, అసలు మూల విరాట్ లు చక్రం తిప్పితూ ఉంటారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెట్టుబడికి నాలుగు ఇంతలు ఆదాయం రావడంతో , ఆ మత్తు నుండి బయట కి రాలేక పోతున్నారు.  నిర్మాతలు,హీరోలు, దర్శకులు, టెక్నిషన్లు, ఈ మహ్మమారి చేతుల్లో నలిగిపోతున్నారు. 6 ఫ్యాక్, 8ఫ్యాక్ కోసం డ్రగ్ వాడితే కండలు వస్తాయి అని హీరోలు సైతం డ్రగ్ కు ఆలవాటు పడుతున్నారు.  వదల మంటే పాముకు కోపం కరవ మంటే కప్పకు కోపం లా ఉంది పరిశ్రమ పెద్దల పరిస్థితి. ఎమైనా కాని టాలీవుడ్ ఈ విషపు కోరల నుండి బయట పడ్డాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: