రాజకీయాలోకి వచ్చి దెబ్బ తినా.....

డాక్టర్ రాజశేఖర్ రాజకీయాలోకి వచ్చి సిని కెరీర్ ను తన చేతు లారా పాడు చేస్తుకున్నారు. రాజకీయాల వల్ల సొంతంగా నిర్మించిన చిత్రాలు సైతం కథ బాగున్న ప్లాప్ అవ్వడంతో , వచ్చిన సినిమా కలెక్షన్ లను దియెటర్ రేంట్ కు కట్టి బాక్స్ లను తెచ్చుకున్న సంఘటణలు రాజశేఖర్ కు ఉన్నాయి.  రాజశేఖర్ సినిమాలు అంటే బయ్యర్లు బయపడే స్దితికి వచ్చారు. పిక్స్ డ్ అభిమానులు రాజశేఖర్ కు ఉన్నా లేని పోని గోడవలు, రాద్దాంతాలకు ఒంటి కాలి పై పోవడంతో ఉన్న అభిమానులను పోగుట్టుకుంటున్నారు. పార్టీల పీరాయింపుల తో రోజు కోక్క పార్టీలోకి వెళ్లి అక్కడ గోడవలతో బయట పడటం నిలకడ లేని మనస్దత్వాన్ని ప్రదర్శంచడంతో అభిమానులు చిరాకు పడుతున్నారు.  హీరో అంటే గీల్లిగజాలు పెట్టు కోవడం కాదు అంటున్నారు అభిమానులు. రాజశేఖర్ సినిమాలకు మినిమం గ్యారంట్రీ ఉండేది. ఇప్పడు ఆయన సినిమాలు బాక్స్ లు కదలని పరీస్థితి. ఈ తరుణంలో కూడా రాజకీయాలకు ప్రధాన్యత నిస్తున్నారు రాజశేఖర్ దంపతులు.  ఆర్దికంగా దెబ్బ తిన్న రాజశేఖర్ ఆత్మ విమర్శ చేసుకుంటే భవిష్యత్ బాగుంటుంది. వయసు కు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటే గత వైభవం పొందవచ్చు. మహాంకాళి, ఆర్జున్ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో మోనాక్క్ చిత్రాన్ని ప్రకటించినా దాని ఆడ్రసే కనిపించడం లేదు.  కామ్రోడ్, ఆచూకి చిత్రాలు చేప్పకోవడానికి తప్పితే ఘాటింగ్ జరిగే సూచన్లు కనిపించడం లేదు. రాజశేఖర్ ను హీరో గా పెట్టి సినిమా తీసే నిర్మాత కోసం జీవిత ఎదురు చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: