అమలాపాల్ టీజర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..!
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచే చేశారు. ఇప్పటివరకు పోస్టర్ల తోనే సర్ప్రైజ్ లు ఇచ్చిన అమలాపాల్ టీజర్ లో పెద్ద షాకే ఇచ్చింది. తాజాగా విడుదలైన టీజర్లో ఒక సన్నివేశంలో అమలాపాల్ పూర్తి నగ్నంగా కనిపించింది. పాత్ర డిమాండ్ చేస్తే అమల ఎలాంటి సన్నివేశాలు చేయడానికి సిద్ధమని అమలాపాల్ మరొకసారి ఈ చిత్ర టీజర్ ద్వారా నిరూపించింది.
కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాక సినీ ప్రముఖుల నుంచి కూడా టీజర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ పై సమంత రియాక్ట్ అయింది. “‘అడై’ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. బెస్ట్ విషెస్ టు అమలాపాల్. సినిమా కోసం నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అంటూ సమంత ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.