యాంకర్ గా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్..?
ఇటువంటి తరుణంలో త్వరలో ప్రారంభం కాబోతున్న మూడో సీజన్ కి రేణు దేశాయ్ అన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. గతంలో సీజన్ 3 కి యాంకర్ గా నాగార్జున ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే తరుణంలో షోలో కంటెస్టెంట్ గా రేణు దేశాయ్ రాబోతున్నట్లు కూడా అదే సమయంలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రేణుదేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన నిజాలను భయటపెట్టారు.
బిగ్ బాస్3 సీజన్ కోసం తనను చాలా మంది సంప్రదించారని ఇంకా నేను వారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నేను కంటెస్టెంట్‌గా రాబోతున్న అంటూ వస్తున్న కథనాలలో వాస్తవం లేదని ఆమె ఆన్నారు. అంతేకాదు ఒక వేళ బిగ్‌బాస్ లోకి అడుగు పెట్టాల్సి వస్తే హోస్ట్‌గా వస్తానని హొస్ట్‌గా చేయడమంటేనే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. మొత్తంమీద చూసుకుంటే రేణుదేశాయ్ చెప్పిన మాటలు బట్టి బిగ్‌బాస్ సీజన్ 3 కి రావటం కష్టమే అన్నట్లు తెలుస్తోంది.