అబ్బా ఏం ఊపు మీద ఉన్నాడు - మహేశ్ కి వరసగా సూపర్ న్యూస్ లు..!
ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కి కలిసొచ్చిన కాలం వచ్చినట్లుగా వరుసగా అదిరిపోయే న్యూస్ లు మహేష్ బాబు పై మీడియాలో వినబడుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే 'టైమ్స్ మోస్ట్ ఫరెవర్ కావాల్సిన క్లబ్'లో దక్షిణాది సినిమా రంగానికి చెందిన మొట్టమొదటి నటుడు మహేష్‌బాబు ఎంపిక అవడం తెలుగు ఇండస్ట్రీ గర్వకారణమని చాలామంది కామెంట్ చేస్తున్నారు.
కేవలం క్లబ్ లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది స్టార్ హీరోలు మాత్రమే గత కొంత కాలం నుండి ఉండేవాళ్ళు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోకి ఇప్పటివరకు ఈ క్లబ్ లో స్థానం దక్కలేదు. తాజాగా మహేష్ బాబుకి 'టైమ్స్ మోస్ట్ ఫరెవర్ కావాల్సిన క్లబ్'లో దక్కడం తో మహేష్ అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు మరోపక్క వరుసగా మహేష్ బాబు సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతున్న క్రమంగా మహేష్ కెరియర్ మంచి ఊపు మీద ఉంది అని ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందిన వారు కామెంట్ చేస్తున్నారు.