KGF 2 బడ్జెట్ ఎంతో తెలిసి రాజమౌళి రియాక్షన్ మామూలుగా లేదు !
ముఖ్యంగా శాండిల్ వుడ్ లో ఏ సినిమా కూడా ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన సినిమా లేకపోవడంతో 'కెజిఎఫ్ 2' బడ్జెట్ వింటున్న చాలామంది వివిధ రకాలుగా ఆశ్చర్యంగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ విన్న దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఈ సినిమా బాహుబలి రికార్డులను పగలగొట్టేటట్లు ఉంది అని కామెంట్ చేసినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.
అయితే ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగానికి చాలా మార్పులు చేసినట్టు తెలిసింది. రేంజ్ పెరిగిపోయింది కాబట్టి రెట్టింపు స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేశారట. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్ లో షూటింగ్ కోసం యష్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఈ రెండు పార్ట్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్..మరియు రవీనాటాండన్ లాంటి సీనియర్ స్టార్లు నటిస్తున్నారని టాక్ ఉంది. గనులు మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ ఫైట్స్ ఉన్నట్టు ఫిలింనగర్ టాక్.