తాప్సీ తో నటిస్తున్న సిద్ధార్థ

Prasad
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో సిదార్థ. ఎప్పూడా బిజీగా ఉండే ఈ హీరో ప్రస్తుతం తెలుగులో నందనిరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం లో నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, నిత్యామీనన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అలాగే హిందీలో సిద్దూ నటించిన చష్మే బద్దూర్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాకు డేవిడ్ థవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక, తమిళంలో ఎన్ హెచ్ 4 సినిమాలో సిద్దూ నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. కాగా, సిద్దార్థ చిత్ర నిర్మాణం వైపూ దృష్టి పెడుతున్నారు. రెండు కొత్త చిత్రాల నిర్మాణానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలుగు, తమిళ బాషల్లో ఈ సినిమాలు తెరకెక్కుతాయని సిద్దూ సన్నిహితులు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: