జెర్సీ లో నానీ చనిపోతాడా ?
గతంలో కబాడి ఆటగాడిగా భీమిలి సినిమాలో నటించిన నాని తాజాగా క్రికెటర్ అవతారం పెట్టడంతో న్యాచురల్ స్టార్ నాని అభిమానులు జెర్సీ సినిమా పై అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబందించిన ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. జెర్సీ సినిమాలో క్రికెటర్గా నటిస్తున్న నాని సినిమాలోని చనిపోతున్నట్లు అది కూడా గ్రౌండ్లోనే అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.
ముఖ్యంగా 38 ఏళ్ళ అతి చిన్న వయసులో గ్రౌండ్ లోనే ప్రాణాలు వదిలిన రమణ్ లాంబా అనే క్రికెటర్ కథ ఆధారంగా రూపొందుతున్న జెర్సీ కు అజ్ఞాతవాసి తర్వాత అనిరుద్ రవి చందర్ సంగీతం అందించడం విశేషం. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో నాని చనిపోతారు అన్న వార్త బయటకి రావడంతో అభిమానుల లో కొంత టెన్షన్ నెలకొంది. మరి సినిమాలో ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.