ఇద్దరు అమ్మాయిల మధ్య సెక్స్.. లెస్బియన్‌ గా రెజీనా..

Chakravarthi Kalyan

సినీ పరిశ్రమలో గుర్తింపు రావాలంటే మంచి సినిమాలైనా దొరకాలి.. లేదా కాంట్రవర్సీ సబ్జక్టులైనా చేయాలి.. ఇదీ ఇప్పటి పరిస్థితి.. తెలుగులో నాలుగైదు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాని రెజీనా ఇప్పుడు రెండో బాట ఎంచుకుంది. తెలుగులో దొరకని సక్సస్‌ ను అందుకునేందుకు బాలీవుడ్ బాట పట్టింది.



ఇప్పుడు ఈ అమ్మడు హిందీలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌ కపూర్‌ తో కలసి ఏక్‌ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా.. అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో విశేషం ఏముందంటారా.. ఇది ఓ లెస్బియన్ స్టోరీ. ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ కథ అన్నమాట. అదేంటి రెజీనా ఇలాంటి పాత్ర చేస్తున్నావ్ అంటే.. బాగానే క్లాస్ పీకుతోంది రెజీనా.



తాను కేవలం సౌత్ ఇండియన్ స్టార్ గా మిలిగిలిపోవడం ఇష్టం లేదట. అన్ని భాషల్లోనూ నటించి టాలెంట్ నిరూపించుకుంటుందట. అందుకే లెస్బియన్ స్టోరీ అయినా సరే.. ఏ మాత్రం వెనుకాడకుండా నటిస్తోందట. అయినా లెస్బియనిజంలో తప్పేముంది.. సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పిందా అంటోంది రెజీనా.



అంతే కాదు.. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం.. ఇంకా ఈ తేడాలేంటి అంటూ బాగానే కబుర్లు చెబుతోంది. ఎవరు ఎలా కావాలంటే అలా బతికే స్వేచ్చ ఉందంటోంది రెజీనా అంతే కాదు.. లెస్బియన్లను సమాజం కూడా అంగీకరించాలంటూ లెక్చర్లు దంచుతోంది. చూడాలి ఈ సినిమా అయినా రెజీనాకు లైఫ్ ఇస్తుందో లేదో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: