రజినీకాంత్‌ రెండో కూతురు మళ్లీ పెళ్లి చేసుకుంటోందా..?

frame రజినీకాంత్‌ రెండో కూతురు మళ్లీ పెళ్లి చేసుకుంటోందా..?

Chakravarthi Kalyan

రజనీకాంత్‌ రెండో కూతురు సౌందర్య మళ్లీ పెళ్లి చేసుకోబోతోందా.. ఇప్పుడు చెన్నై ఫిల్మ్ సర్కిళ్లో ఇదే హాట్ డిస్కషన్. రజీనీకాంత్ రెండో కూతురు నిర్మాతగా, దర్శకురాలిగా తమిళప్రేక్షకులకు పరిచయమే. తండ్రి హీరోగా కొచ్చాడయాన్ రూపొందించిందామె.

సంబంధిత చిత్రం


ఆ తర్వాత ధనుష్‌తో వీఐపీ 2 సినిమాతో హిట్ కొట్టింది కూడా. కానీ వైవాహిత జీవితంలో సౌందర్య అంత సంతోషంగా లేదు. ఆమెకు 2010లో అశ్విన్ అనే ఇండస్ట్రియలిస్ట్ తో పెళ్లయింది. ఆ జంటకు ఓ కొడుకు కూడా. పేరు వేద్.

rajinikanth daughter soundarya కోసం చిత్ర ఫలితం


కానీ ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయి. కలిసి కాపురం చేయలేకపోయారు. రెండేళ్ల క్రితం సౌందర్య భర్త నుంచి విడిపోయింది. ఇప్పుడు సౌందర్య మళ్లీ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.

rajinikanth daughter soundarya visagan కోసం చిత్ర ఫలితం


సినీరంగంలోకి అడుగుపెట్టిన పారిశ్రామిక వేత్త విశాగన్ ను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. అమెరికాలో చదువుకుని వచ్చిన విశాగన్‌... ‘వంజగర్‌ ఉలగం’అనే మూవీలో నటించారు. ఓ నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. ఫిబ్రవరి 11న వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని కోలీవుడ్ కోడై కూస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: