వీరు పోట్ల తో నాగచైతన్య

Prasad
బిందాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వీరు పోట్ల తరువాత అక్కినేని నాగార్జునతో రగడ సినిమా తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేశాయి. కాగా, ఇప్పడు అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమాని తెరకెక్కించడానికి వీరు పోట్ల సన్నాహాలు చేసుకుంటున్నాడు. నాగచైతన్యకు సరిపడే కథను వీరు పోట్ల ఇప్పటికే రెడీ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, వీరు పోట్ల దర్శకత్వంలో నాగచైతన్య నటించే చిత్రాన్ని కామాక్షి మూవీస్ బ్యానర్ నిర్మించనుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: