చరణ్ బన్నీల తిరస్కరణకు షాక్ లో బహుళ జాతి సంస్థలు !

Seetha Sailaja
స్టార్ హీరోలు తాము చేసే సినిమాల పారితోషికం కంటే ఎక్కువగా బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ద్వారా పారితోషికాలు పొందుతూ ఉంటారు. అందువల్ల దీనితో స్టార్ హీరోల సంపాదనలో బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ఆదాయం కీలక పాత్రను పోషిస్తున్నాయి. అయితే నిజ జీవితంలో కూడ భార్య భర్తలు అయిన స్టార్ సేలేబ్రెటీలు కలిసి నటించిన యాడ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి.

అమితాబ్ బచన్ జయాబచన్ నుండి విరాట్ కోహ్లీ అనుష్క శర్మల వరకు కలిసి నటించిన యాడ్స్ బాగా పాపులర్ అవ్వడంతో మన దక్షిణాది లో కూడ సూర్య జ్యోతిక నాగచైతన్య సమంతలతో అనేక కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ప్రమోషన్ కోసం యాడ్స్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా జనానికి కనెక్ట్ అవుతున్న నేపధ్యంలో కొన్ని బహుళ జాతి సంస్థల దృష్టి చరణ్ ఉపాసన అల్లు అర్జున్ స్నేహా రెడ్డిల పై పడినట్లు సమాచారం.

ఒకప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీకి సంబంధించిన టూత్ పేస్ట్ యాడ్ లో చరణ్ ఉపాసనలను కానీ లేదంటే అల్లు అర్జున్ స్నేహా రెడ్డిలతో కానీ నటింప చేయాలని ఆ సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేసినా తన భార్యతో కలిసి యాడ్ లో నటించడానికి చరణ్ అదేవిధంగా బన్నీ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలలో పారితోషికం ఆఫర్ చేసినా వీరిద్దరూ ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లు టాక్. 

ఉపాసన అదేవిధంగా స్నేహా రెడ్డి తమ భర్తలతో కలిసి అనేక ఫంక్షన్స్ కు రావడమే కాకుండా సోషల్ మీడియాలో కూడ చాల యాక్టివ్ గా ఉంటారు. ఇక ఉపాసన అయితే బిజినెస్ ఉమన్ గా ఇప్పటికే ఎంతో పేరును సంపాధించుకుంది. బయట ప్రపంచంలో ఇంత యాక్టివ్ గా ఉన్నా యాడ్స్ లో తమ భర్తలతో కలిసి నటించడానికి ఉపాసనా స్నేహా రెడ్డిలు రిజెక్ట్ చేయడంతో వారి పై ఎన్నో ఆసలు పెట్టుకున్న ఆ బహుళ జాతి సంస్థ ఆశ్చర్య పోయినట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: