అల్లు అర్జున్ రాంగ్ యాటిట్యూడ్ పై తీవ్ర విమర్శలు !

Seetha Sailaja
అల్లు అర్జున్ కేవలం మెగా అభిమానుల సపోర్ట్ తోనే కాకుండా తనకు తానుగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న స్టైలిష్ స్టార్. ఇలాంటి పరిస్థుతులలో అల్లు అర్జున్ ఒక విషయంలో వ్యవహరించిన తీరుకు బన్నీ అభిమానులు కూడ తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సోషల్ మీడియాలో ఎప్పుడు సందడి చేసే అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ కు రెండు మిలియన్ ల ఫాలోయర్స్ ఏర్పడ్డారు. ఈవిషయానికి సంబంధించిన న్యూస్ ను అధికారికంగా బన్నీ పిఆర్ టీమ్ అల్లు అర్జున్ అభిమానులకు లీక్ చేస్తూ బన్నీ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసాడు అంటూ ప్రశంసలు కురిపించింది. 

ఇప్పుడు ఈవిషయమై అల్లు అర్జున్ అభిమానులకు కూడ తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ఇన్ స్టా గ్రామ్ లో తన ఎకౌంట్ కు ఏర్పడ్డ రెండు మిలియన్ ఫాలోయర్స్ సంఖ్య వెనుక బన్నీ అభిమానుల కృషి కూడ ఉంది అన్న విషయం గుర్తించకుండా కనీసం తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేయవలసిన నైతిక బాధ్యతను కూడ అల్లు అర్జున్ మర్చిపోయాడా అంటూ కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు. 

మరికొందరైతే అమితాబ్ బచన్ ప్రియాంక చోప్రా లాంటి ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రెటీలు తమకు ఫాలోయర్స్ సంఖ్య పెరిగినప్పుడల్లా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉంటే ఈకనీస బాధ్యత కూడ బన్నీకి లేదా అంటూ అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ‘నాపేరు సూర్య ఫెయిల్యూర్ తో తన ఇమేజ్ ను తగ్గించుకున్న బన్నీ ఇప్పుడు ఏకంగా తన అభిమానుల అసంతృప్తికే కారణం అయిన నేపధ్యంలో వాస్తవాలు గ్రహించి నష్ట నివారణ చర్యలు చేపడతాడో లేదో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: