నాని వివాదాస్పద వ్యాఖ్యలకు అసహనంలో వైద్యులు !

Seetha Sailaja
రేపు విడుదల కాబోతున్న ‘దేవదాస్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సమావేశంలో హీరో నాని అనుకోకుండా వైద్యుల పై చేసిన కామెంట్స్ కొంతమంది వైద్యులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ‘దేవదాస్’ సినిమాలో డాక్టర్ గా నటించిన నాని నాగార్జునతో కలిసి మందు కొడుతున్న సీన్స్ గురించి మాట్లాడుతూ తనకు తెలిసిన డాక్టర్లంతా ముందుకొడతారని ఆవిషయాలనే సినిమాలో చూపించాము అంటూ నాని కామెంట్ చేసాడు.

ఇప్పుడు ఈకామెంట్ వైద్యులలోని కొందరికి తీవ్ర అసహనాన్ని కలిగించడంతో ప్రతివ్యక్తికి తమ వ్యక్తిగత జీవితంలో అనేక అలవాట్లు ఉంటాయని ఆవిషయాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ నాని తనకు తెలిసిన డాక్టర్లు అందరూ మందు కొడతారు అంటూ కామెంట్ చేయడం ఎంత వరకు సమంజసం అంటూ నాని కామెంట్స్ పై ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు టాక్. దీనితో సరదాగా నవ్వించడానికి నాని అన్న మాటలు సమాజంలోని ఒక వర్గానికి బాధ కలిగించేలా మాట్లాడటం యాదృశ్చికం అనుకోవాలి.

ఇదే మీడియా సమావేశంలో మాట్లాడిన నాని మరొక ట్విస్ట్ ఇస్తూ తనకు సెల్ ఫోన్ పిచ్చి ఎక్కువ అంటూ నాగార్జున చేసిన కామెంట్స్ కు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. తాను సెల్ ఫోన్ చూస్తాను అన్న విషయం వాస్తవమే అయినా నాగార్జున తన పై చేసిన కామెంట్స్ తో ఈవిషయం తన పై ఒక నిందలా మారిపోయింది అంటూ జోక్ చేసాడు.

ఇక ఈసినిమా రీమేక్ అన్న విషయం పై వస్తున్న వార్తలను ఖండిస్తూ ఈమూవీ ఏసినిమాకు రీమేక్ కాదనీ కొందరు రచయితలు వర్క్ చేసి ‘దేవదాస్’ కథకు తుదిమెరుగులు దిద్దారు అని అంటున్నాడు నాని. ఈమూవీ సక్సస్ అయితే ‘దేవదాస్’ కు సీక్వెల్ ఉంటుంది అంటూ నాగార్జున చేస్తున్న కామెంట్స్ ను బట్టి రానున్న రోజులలో నాగార్జున ఎక్కువగా మల్టీ స్టారర్స్ చేసే ఆస్కారం ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..   
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: