‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!

frame ‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!

siri Madhukar
టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ప్రతిరోజు కొత్త కొత్త అప్ డేట్స్ ఇస్తున్నారు.  క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా ‘ఎన్టీఆర్’. ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన విషయాలు..ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు, వెండి తెరను ఎలా ఏలారు..నటుడిగా,దర్శకుడిగా, నిర్మాతగా ఎలా రాణించారు అన్న విషయాలు చూపించబోతున్నారట. 

అంతే కాదు హీరోగా తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన తర్వాత రాజకీయాల్లోకి ఎలా వచ్చారు..కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి ఎలా వెళ్లారు అన్న విషయాలు కూడా అద్భుతంగా చూపించబోతున్నారట.  అయితే ఈ సినిమాలో సినీ, రాజకీయ నేపథ్యంలో కీలకమైన వ్యక్తుల పాత్రలు కూడా ఎంతో కీలకం. 

ఇక ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు.  ప్రస్తుత ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, నాగేశ్వరరావు పాత్రలో సుమంత్,  ఎస్వీఆర్ పాత్రలో నాగబాబు, శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు సమాచారం.  తాజాగా ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన కూతురు..రాజకీయాల్లో రాణిస్తున్న పురంధరేశ్వరి పాత్రలో విజయవాడకు చెందిన ప్రముఖ నృత్య కారణి హిమన్సీ కనిపిస్తున్నారు.

ఈ పిక్ చూసిన నెటిజన్లు ఈ పాత్రకు హిమన్సీ సరిగ్గా సరిపోతారని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  సంక్రాంతి బరిలో నిలిపేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: