బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో!

frame బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో!

Edari Rama Krishna
బిగ్ బాస్ 2 సీజన్ ఎండింగ్ కి వచ్చింది.  మొదట్లో బిగ్ బాస్ సీజన్ 2 చూడటానికి పెద్దగా ఇష్టపడని వారు..రోజు రోజుకీ ఈ గేమ్ షో లో ఉత్కంఠత పెరుగూ వస్తుంది.  పదిహేడు మందితో మొదలైన బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఇక శని, ఆదివారాల్లో నాని చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.  100 ఎపిసోడ్‌లను క్రాస్ చేసి శనివారం నాటితో 104 ఎపిసోడ్‌లకు చేరుకుంది. ఇక ఒకే ఒక్కవారం మిగిలి ఉండటంతో ఆరుగురు (తనీష్, గీత, దీప్తి, కౌశల్, సామ్రాట్, రోల్ రైడా) మాత్రమే మిగిలారు.  ఈ వారం మొదట్లో ఇంటి సభ్యులు అందరూ ఎలిమినేట్ అయ్యారు.

ఇక గీతా మాధురి తొలి నుండి చాలా బ్యాలెన్డ్‌గా గేమ్ ఆడుతూ.. కౌశల్ తరువాతి స్థానాన్ని పదిలం చేసుకుంది.  తనీష్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం నుండి టాస్క్‌ల విషయంలోనూ, పెర్ఫామెన్స్ పరంగా చాలా పూర్ అయినప్పటికీ హౌస్ మేట్స్ అండతో ఎలిమినేషన్స్ నుండి ఎస్కేప్ అవుతూ చివరి వారం వరకూ దూసుకొచ్చేశాడు. ఇక మరో కంటెస్టెంట్ దీప్తి నల్లమోతు ఇప్పటికే చాలా సార్లు ఎలిమినేషన్స్ నుండి తప్పించుకుంది. ఎలాగోలా చివరి వారం వరకూ నెట్టుకొచ్చిన దీప్తికి ఈవారం ఎలిమినేషన్ ప్రాణసంకటంగా మారింది.

పై నలుగురు కంటెస్టెంట్స్‌తో పోల్చుకుంటే దీప్తి వీక్ అనే చెప్పాలి. ఇక మిగిలింది రోల్ రైడా. బిగ్ బాస్ ఇచ్చిన ‘మీ గుడ్డు జాగ్రత్త’ టాస్క్ ద్వారా డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్లే ఛాన్స్ వచ్చినప్పటికీ చివర్లో చేతులెత్తేసి.. సామ్రాట్‌ వైపు మొగ్గు చూపిన రోల్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు.  మరి ఈసారి ఎలిమినేట్ ఎవరు అవుతారో ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: