తెలుగు సినిమా గొప్పతనాన్ని యావత్తు ప్రపంచానికి చాటిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఆయన ఏ విషయంలోనైనా ఎంతో నిక్కచ్చిగా ఉండేవారు. ఒకరికి మాట ఇస్తే ఎట్టి పరిస్థితులలోనూ తప్పేవారు కాదు.
అవి ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధ పడుతున్న రోజులు.. రాజకీయల్లోకి ప్రవేశించే ముందు ఒక సినిమా చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. నిర్మాతలకు మాట కూడా ఇచ్చారు. అయితే సమయం తక్కువ గా ఉంటడంతో కొత్త కథ ను సిద్ధం చేసుకోవడం కష్టమని అమితాబ్ నటించిన ‘లావారిస్’ను నా దేశం పేరుతో రీమేక్ చేయడానికి నిర్ణయించుకున్నారు. నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
కాగా, షూటింగ్ మొదటి రోజున ఎన్టీఆర్ మేకప్ వేసుకుంటుండగా, ఆయన కొడుకు జయకృష్ణ వచ్చి లావారిస్ సినిమా హిందీలో ఫ్లాప్ అయిందని, కాబట్టి తెలుగులో చేయడానికి వీలులేదని ఎంతో పట్టుబట్టారట. అయితే ఎన్టీఆర్ మాత్రం అంగీకరించలేదు. ఇప్పడు సినిమా చేయనంటే నిర్మాతతో పాటు, ఎంతో మంది బాధపడతారని ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. సినిమా త్వరగా విడుదల అయ్యేటట్లు చూశారు. అదీ ఎన్టీఆర్ గొప్పతనం.
అయితే జయకృష్ణ చెప్పినట్లు నా దేశం సినిమా ప్రేక్షదారణను మాత్రం పొందలేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: