సినిమా తీయడం మహా యజ్ఞం : మోహన్ బాబు

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యభరిత చిత్రాల్లో నటించారు. సాంఘిక, పౌరాణిక,జానపద చిత్రాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను మెప్పించారు.  నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాత కూడా కొనసాగుతున్నారు.  అంతే కాదు విద్యావేత్త, రాజకీయవేత్తగా తన సత్తా చాటుతున్నారు. అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించిన మోహన్ బాబు ఇప్పటి కుర్రహీరోలతో సైతం నటించి మెప్పించారు. 

‘మహానటి’లో మోహన్ బాబు అలనాటి మేటి నటులు ఎస్వీరంగారావు పాత్రలో కనిపించారు.  ఈ మద్య సోషల్ మాద్యమాల్లో యాక్టీవ్ గా ఉంటున్న మోహన్ బాబు తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేశారు. తాజాగా సినిమా నిర్మాణం అంటే ఎంతో పెద్ద భాద్యత అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పారు మోహన్ బాబు. ‘‘ఒక సినిమా నిర్మించడంలో.. నిర్మాత భుజాలపై చాలా పెద్ద బాధ్యత ఉంటుంది.

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నేను నిర్మించిన మొదటి సినిమా ‘ప్రతిజ్ఞ’ సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులు ప్రదర్శించబడింది’’ అంటూ అప్పట్లో తాను దిగిన ఓ ఫోటోను జతచేస్తూ ట్వీట్ చేశారు. 1982 లో ప్రారంభించబడిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్.. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కామెంట్స్, లైకులతో ఈ ట్వీట్‌ను హోరెత్తిస్తున్నారు మోహన్ బాబు అభిమానులు.
 Producing a film means shouldering a huge responsibility. #Prathigna was my first production under Sree Lakshmi Prasanna Pictures that successfully ran for 100 days. pic.twitter.com/JmTLbDFLKu
— Mohan Babu M (@themohanbabu) June 4, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: