రాఘవేంద్రరావు స్పెషాలిటీ

HANUMA HANUMA
 ఇప్పుడొస్తున్న హీరోయిన్లకు తెలుసో లేదోగానీ నిన్నటి తరం హీరోయిన్లు తప్పకుండా ఒక్కసారైనా రాఘవేంద్రరావు సినిమాలో నటించాలని కోరుకునేవారు. హీరోయిన్లను పండ్లు, పువ్వులతో కలిపి ఆయన చూపించినంత అందంగా ఇంకెవ్వరూ చూపించలేరని ఓ నమ్మకం. బాపు బొమ్మలు చూడచక్కగా, సంప్రదాయబద్ధంగా కనువిందు చేస్తే, రాఘవేంద్రరావు నాయికలు కమర్షియాలిటీకి ప్రతీకలుగా కనిపించేవారు. స్నేహ, తాప్సీలకు ఈ మధ్య ఆ అదృష్టం దక్కింది. తాజాగా ఈ పెద్దాయనను మెప్పించింది అనన్య. ఇటీవల పెళ్ళి గొడవల కారణంగా నిత్యం వార్తల్లో కనిపించిన అనన్య రాఘవేంద్రరావు తీయబోయే సినిమాలో నాయికగా నటించనుంది. అనన్యను హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలిసి మిగిలిన నాయికలు తమ దురదృష్టాన్ని తలచుకుని చింతిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: