పవన్ అర్ధరాత్రి కాల్ తో షాక్ అయిన సాయి ధరమ్ తేజ్ !

Seetha Sailaja
ప్రస్తుతం మెగా యంగ్ హీరోలలో ఒక్క సాయి ధరమ్ తేజ్ కు తప్ప మిగతా వారందరికీ కెరియర్ బ్రహ్మాండంగా కొనసాగుతోంది. వరస పరాజయాలకు ‘ఇంటలిజెంట్’ మూవీ చెక్ పెడుతుంది అని అనుకుంటే తేజ్ కెరియర్ లోని అతి పెద్ద ఫ్లాప్ గా ‘ఇంటలిజెంట్’ మూవీ మారడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనితో మెగా మేనల్లుడి కెరియర్ ముగిసిపోయింది అంటూ విపరీతమైన నెగిటివ్ ప్రచారం కూడ మొదలైపోయింది. 

ఈపరిస్థుతులలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది. తన సినిమాల జయాపజయాల గురించి కూడ ఏమాత్రం పట్టించుకోని పవన్ తన ముద్దుల మేనల్లుడు సినిమా కెరియర్ పై సీరియస్ దృష్టి పెట్టినట్లు సమాచారం. 

దీనితో సాయి ధరమ్ తేజ్ తో తదుపరి సినిమాను తీయబోతున్న తమిళ దర్శకుడు కరుణాకరన్ కు పవన్ ఫోన్ చేసి తేజ్ తో అతడు తీయబోతున్న సినిమాకు సంబంధించిన కథను మిగతా వివరాలను తనకు సవివరంగా చెప్పవలసిందిగా కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని విషయాలను తనకు ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెలియచేయమని అత్యుత్సాహంతో ఖంగారుగా ఈసినిమాను తీయవద్దని పవన్ కరుణాకరన్ కు గట్టి సూచనలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఒకప్పుడు పవన్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన ‘తొలిప్రేమ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కరుణాకరన్ అంటే పవన్ కు ఎంతో అభిమానం అన్న విషయం తెలిసిందే. అయితే యంగ్ డైరెక్టర్ల హవా బాగా పెరిగి పోవడంతో కరుణాకరన్ ఈ రేస్ లో బాగా వెనకపడిపోయాడు. అయినా తనకు కెరియర్ బ్రేక్ ఇచ్చిన కరుణాకరన్ అదే బ్రేక్ ను సాయి ధరమ్ తేజ్ కు కూడ ఇస్తాడు అని పవన్ బాగా నమ్ముతున్నాడు. దీనికితోడు మళయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ తేజ్ తో మొట్టమొదటిసారి నటిస్తున్న నేపధ్యంలో ఈసినిమాను ఏదో విధంగా హిట్ చేయాలి అన్న ప్రయత్నాలకు పవన్ సలహాలు తోడవ్వడం ఎంత వరకు సహకరిస్తాయో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: