నా తండ్రి ఆ పని చేయమని ఒత్తిడి చేశాడు : నటి ఖుష్బు

Edari Rama Krishna
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో 90వ దశకంలో అందాల తారగా ఒక్క వెలుగు వెలిగిపోయిన నటి ఖుష్బు.  ఇక తమిళ ఇండస్ట్రీలో ఖుష్బుని ఎంతగా ఆరాధించేవారంటే..ఆమె కోసం ఏకంగా గుడినే నిర్మించి పూజించారు. అంత క్రేజ్ సంపాదించిన నటి ఖుష్బు తర్వాత రాజకీయాల్లో కూడా తన సత్తా చాటారు.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఖుష్బు రీసెంట్ గా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో పవర్ తల్లిగా నటించారు.  తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో తన జీవితంలోని చేదు ఘటనలను, ఆ సమయంలో అనుభవించిన దుఃఖాన్ని నటి ఖుష్బూ గుర్తుచేసుకున్నారు.

తన పదహారవ యేటేనే తన తండ్రిని ఎదిరించి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు ఆమె చెప్పారు.  మా నాన్నతో ఉండలేక.. మా అమ్మను, సోదరుడ్ని తీసుకుని బయటకొచ్చేశా. మా నాన్న మహిళలను కించపరుస్తూ మాట్లాడటం నాకు నచ్చలేదు. భార్యను అసభ్యంగా దూషించే భర్త ఆయన.  మా అమ్మను తిట్టడం మగాడి ప్రపంచంలో భార్య ఇలాగే ఉండాలన్న గర్వం నాకు నచ్చలేదు. ఇంటి నుంచి బయటకొచ్చేటప్పటికీ నాకు 16ఏళ్లు. గతి లేక మీరే ఏదో రోజు నాదగ్గరికి వస్తారని మా నాన్న అన్నారు. 

తన తల్లిని మా  కళ్ల ముందే అసభ్యంగా తిట్టడం..కొట్టడం చేసే వాడని..ఇది నేను భరించలేక పోయానని అన్నారు ఖుష్బు. భిక్షాటన చేసి డబ్బు ను తీసుకురావాలని ఆయన తనకు చెప్పేవాడని ఆమె వివరించింది.ఆరోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది.. 1986 సెప్టెంబరు 12. నువ్వు పాక్కుంటూ వెళ్లి బిక్షాటన చేసి, డబ్బు తీసుకురా అని ఆ రోజు మా నాన్న నాతో అన్నాడు. అమ్మను, సోదరుడిని చంపేసి..నేను రైలు కిందపడి చస్తా కానీ ఆ పని చేయను చెప్పాను. 

ఎప్పటికైనా నా ఎదుగుదల చూసి నువ్వే ఆశ్చర్యపోతావని కుమిలి పోతావని ఆయనతో శపథం చేశాను. ఆ స్థాయికి చేరుకున్నందుకు సంతోషంగా ఉన్నా.  ఆ శపథం చేసి 31ఏళ్లయినా ఇప్పటికీ నాన్న ముఖం చూడలేదు. చూడాలని కూడా అనుకోవట్లేదు. కాగా, సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంటూన్నామన్నారు ఖుషు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: