ఏపీ అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు.. జెడీ వాన్స్ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!
538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అమెరికాలో ఎవరైనా విజేతగా నిలవాలంటే 270 ఓట్లు అవసరం అనే సంగతి తెలిసిందే. ఉష అమెరికాకు సెకండ్ లేడీగా వ్యవహరించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయం నేపథ్యంలో ఉష పేరు ఒకింత సంచలనం అవుతోంది. ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి కాగా ఆమె పూర్వీకులది ఏపీలోని పామర్రుకు దగ్గర్లో ఉన్న ఒక కుగ్రామం.
గత ఎన్నికల్లో భారత మూలాలున్న కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయ్యారనే సంగతి తెలిసిందే. విశాఖలో కూడా ఉషా చిలుకూరికి బంధువులు ఉన్నారని భోగట్టా. దేశం గర్వించే స్థాయికి ఎదిగిన ఉష, ఆమె భర్త సక్సెస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. వైజాగ్‌కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ సి శాంతమ్మకు ఉషా చిలుకూరి మనవరాలు వరస అవుతారని తెలుస్తోంది.
ఉషా చిలుకూరి తల్లీదండ్రులు 1980లలో అమెరికాకు వలస వెళ్లారని తెలుస్తోంది. ఉషా చిలుకూరి తండ్రి ఏరోస్పేస్ ఇంజనీర్ కాగా ఆయన యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరో డైనమిక్స్ స్పెషలిస్ట్ గా పని చేశారు. ఉషా చిలుకూరి యేల్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొందారు. యేల్ లా స్కూల్ లో ఉషా చిలుకూరి జేడీ వాన్స్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆంధ్రా అల్లుడికి దక్కిన అరుదైన గౌరవంపై నెటిజన్ల నుంచి జేడీ వాన్స్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.