భారతీయుడిని దోచుకున్న నేపాలీ అందం

Prasad
అందాల భామ మనీషా కోయిరాల పుట్టింది నేపాల్ దేశంలో అయినా రాణించింది మాత్రం భారతీయ సినిమాలలోనే. ఖాట్మాండ్ లో ఆగస్టు 16, 1970లో మనీషా జన్మించింది. 1989లో వచ్చిన ఫెహరీ బైతుల్లా అనే నేపాలీ సినిమాతో మొట్టమొదటగా వెండి తెర మీద కనిపించింది. 1991లో విడుదలైన సౌదాగర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. 1942:లవ్ స్టోరీ సినిమా మనీషాకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చింది. అగ్నిసాక్షి, గుప్త్ సినిమాలతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారింది. బొంబాయి, భారతీయుడు వంటి సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్రిమినల్ అనే స్ట్రైయిట్ తెలుగు సినిమాలోనూ మనీషా కొయిరాల నటించింది. సినిమా హీరోయిన్ గా మనీషా కోయిరాల ఎంత క్రేజ్ తెచ్చుకుందో, వ్యక్తిగతంగా ఆమె అన్ని ఆరోపణలనూ ఎదుర్కొంది. మితిమీరి మద్యం సేవించడం, తన కంటే సీనియర్ నటుడు అయిన నానా పటేకర్ తో ఎఫైర్.. వంటి పత్రికల కథనాలతో వార్తల్లో తరచూ నిలిచేది. వయస్సులో తనకంటే చిన్నవాడైన సామ్రాట్ ను 2010లో వివాహం చేసుకున్న మనీషా ఇటీవలే అతనికి విడాకులు ఇచ్చింది. కాగా, కరీనాకపూర్ నటిస్తున్న హీరోయిన్ చిత్రం మనీషా కొయిరాల జీవితం ఆధారంగా తెరకెక్కుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన కెరీర్ లో ఎత్తు పల్లాలు చవిచూసిన మనీషా కోయిరాల మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని కోరుకుందాం..! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: