మరోసారి మనల్ని మురిపించటానికి వస్తున్న "టైటానిక్": జేమ్స్ కేమరూన్





జేమ్స్ ఫ్రాన్సిస్ కేమరూన్ ను గురించి కొత్తగా ప్రత్యేకించి చెప్పాల్సిన పనేమి లేదు. అద్భుత దృశ్యకావ్యాలను వెండి తెరపై మహోన్నతంగా కనువిందుగా మలచటం లో ఆయనకు ఆయనే సాటి. ఆయన రచయిత, దర్శకుడుగా, ఎడిటర్గా, నిర్మాతగా ఏదోరకంగా పనిచేసి నిర్మించిన సుమారు 10 సినిమాలు విశ్వవిఖ్యాతమైనవే. అందులో అద్భుత సాహస ప్రేమకావ్యం గా ప్రపంచం గుర్తించిన టైటానిక్ ఒక్కదానికే 27 ప్రఖ్యాత అవార్డులు దక్కాయి.


 


20 ఏళ్ల క్రితం ఈయన దర్శకత్వంలో వచ్చిన టైటానిక్ ప్రపంచవ్యాప్తంగా కలక్షణ్లే కాక అవార్డులు రికార్డుల వర్షం సృష్టించిన సంగతి పాఠకులకు తెలిసిందే. 105 ఏళ్ల క్రితం ఆరెమెస్ టైటానిక్ ఎలా మునిగిపోయింది, అప్పటి పరిస్థితులు ఏమిటి? అన్న విషయాలను కెమరూన్ కళ్లకు కట్టనట్లు చూపించారు. ఆ వాస్తవ పరిస్థితులను వివరిస్తూనే అందులో ఓ అందమైన ప్రేమకథను జోడించి లియోనార్డో డెకాప్రియో, కేట్ విన్స్లేట్ మధ్య వారి అద్భుత నటనను తో ఆ ప్రేమకావ్యాన్ని నడిపించి ప్రేక్షకులను కట్టిపడేశారు. 




అయితే, టైటానిక్ అనుభూతిని మరోసారి ప్రేక్షకులకు అందించేందుకు కెమరూన్ రెడీ అవుతున్నారు. తను తీసిన చిత్రంలోని లోటుపాట్లపై వివరణ ఇస్తూ టైటానిక్ పై ఒక ఓ డాక్యుమెంటరీ తీయబోతున్నట్లు తెలుస్తుంది. 2016 ఏప్రిల్ నాటికి టైటానిక్ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయింది. అయితే, ఆ చిత్రంలోని పలు సన్నివేశాల్లో జరిగిన ఘటనలు సందేహాలుగానే మిగిలిపోయాయి. వాటికి వివరణ ఇస్తూ, టైటానిక్ చిత్ర విశేషాలు, చరిత్రలో జరిగిన ఘటనలను సవివరంగా తెలియ జేసేందుకు టైటానిక్ మీద ఒక గంట నిడివి గల ఒక డాక్యుమెంటరీని జేమ్స్ కేమరూన్  రూపొందించనున్నారు. ఇందులో మరిన్ని కొత్త విషయాలను జోడించి సరికొత్త టైటానిక్ ను తెరకెక్కించనున్నారు.





"నేను టైటానిక్ కథ రాసుకున్నప్పుడు, తెరకెక్కించే సమయంలో నిజమైన టైటానిక్ లాగానే ప్రతీది యథాతథంగా, సవివరం గా చూపించాలనుకున్నాను. ఎందుకంటే నేను ఒక చరిత్రను మరోసారి రూపొందించాను.  దీన్ని టైటానిక్ ప్రమాదం లో మరణించిన వారి గౌరవార్థం చిత్రీకరించాను. కానీ నేను అనుకున్నట్టుగానే సినిమాను తీయగలిగానా? లేదా? అని నాకే అనేక సార్లు సందేహం కలుగుతూ వస్తుంది. అందుకే ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ వారితో కలిసి కొత్తగా పరిశోధనలు జరిపి నూతన సాంకేతిక పరిఙ్జానంతో అంతకు మించిన పరిపక్వతతో  మరోసారి టైటానిక్ ను మీ కళ్లముందు ఆవిష్కరించబోతున్నా"ని కెమరూన్ చెప్పుకొచ్చారు. 


అనుకున్నప్రకారం అన్నీ జరిగితే ఈ డాక్యుమెంటరీని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశీయనగా టైటానిక్ 658.60 మిలియన్ కాగా, ప్రపంచ వ్యాప్తంగా $ 2.18 బిలియన్లు వసూళ్ళు సాధించి ప్రపంచపు అత్యున్నత వసూళ్ళు సాధించి $ 2 బిలియన్ల పైగా వసూళ్ళు సాధించి, "సెకండ్ బిగ్గెష్ట్ గ్రాసర్" గా పేరుతెచ్చుకుంది. తొలిస్థానం "అవతార్" చిత్రానిది. అవతార్ కు కూడా జేమ్స్ ఫ్రాన్సిస్ కేమరూన్ నే దర్శకుడు.    
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: