వరుణ్ తేజ్ ‘ఫిదా’ బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  అయితే ఇప్పటి వరకు మెగా హీరోలు ఎవరి టాలెంట్ వారు చూపించుకుంటూ వస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించారు..తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. 


  ఇది వరుణ్ తేజ్ కెరీర్ లో అత్యంత పెద్ద సక్సెస్ అని మెగా ఫ్యాన్స్ తెగ సంతోషంలో ఉన్నారు. శేఖర్ కమ్ముల మార్క్ సినిమాగా వచ్చిన ఫిదా ఎంతో సహజమైన కథ కథనాలతో ఆకట్టుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి రన్నింగ్ లో ఉందని చిత్ర యూనిట్ అంటున్నారు.  

ఇప్పటి వరకు ఫ్యామిలీ చిత్రాలకు పెద్ద పీట వేసిన శేఖర్ కమ్ముల మరో మంచి ప్రేమ, ఫ్యామిలీ, ఎమోషనల్, సెంటిమెంట్ అన్ని ఎలిమెంట్స్ ‘ఫిదా’ చిత్రంలో చూపించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన సాయిపల్లవి నటించింది.  ఇక చిత్రంలో సాయి పల్లవి చేసిన నటన, తెలంగాణ యాస హైలెట్ గా నిలిచిందని ప్రేక్షకులు ఖితాబు ఇచ్చారు.  


ఫిదా బాక్సాఫీస్ కలెక్షన్లు :

నైజాం          : 2.82 Crore
సీడెడ్            :  78 Lakhs
ఉత్తరాంధ్ర     : 81 Lakhs
ఈస్ట్           :52.5 Lakhs
వెస్ట్                : 33.3 Lakhs
కృష్ణ                 : 41.7 Lakhs
గుంటూరు            : 55.5 Lakhs
నెల్లూరు                :  20 Lakhs

ఏపీ + నైజాం : 6.44 Crore 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: