హాలీవుడ్ రెడ్ కార్పెట్ పై - బాలీవుడ్ అందాల - విందు








తమ అందం, సొగసు సోయగం తో అంతర్జాతీయ వేదికలను వేడిక్కిస్తున్న దేశీ గర్ల్స్ ప్రియాంకా, దీపికాలు, ఈసారి గ్లోబల్ మీడియా దృష్టిని ఆకట్టుకున్నారు. "మెట్ గాలా అవార్డ్స్" ఫంక్షన్‌లో అందాల ఆరబోతతో ప్రేక్షకులను వీక్షకులను మత్తెక్కించేశారు.  బాలీవుడ్ బ్రాండ్ అంబాసిడర్లుగా హాలీవుడ్‌ నే ఊపేస్తున్న సొగసుల సోయగాల ద్వయం గా వెలుగు వెలిగిపోతున్న ప్రియాంకా, దీపికా, మరోసారి అంతర్జాతీయ మీడియా దృష్టిని తమవైపుకు తిప్పుకొని మాయలో పడేసి ఆకట్టుకున్నారు. మెట్ గాలా అవార్డ్స్ వేడుకకు హాజరైన ఈ దేశీ బ్యూటీలు, తమదైన స్టైల్ సెన్స్‌ తో ఫాషన్ క్రిటిక్స్‌ ను క్లీన్ బౌల్డ్ చేశారు.





హాలీవుడ్‌లో ఏ ఈవెంట్ జరిగినా రెడ్ కార్పెట్ పై వీరి "స్టన్నింగ్స్ అప్పీరెన్స్‌" ఒక సాంప్రదాయంగా మారిపోయాయి. జనాలకు తమ అందం తో కిక్ ఇవ్వడంలో ఇప్పటికే ఆరితేరి పోయిన ప్రియాంకా చోప్రా "మెట్ గాలా అవర్డ్స్‌" లోనూ మురిపిస్తూ మెరిసిపోయింది. లారెన్ రాల్ఫ్ లాంగ్ ట్రెంచ్ కోట్‌లో చూపరులను కళ్లు తిప్పుకోనివ్వలేదు. ఫ్యాషన్ హిస్టరీ లో లాంగెస్ట్ ట్రెంచ్ కోట్ ధరించిన నటీమణిగా ప్రియాంక రికార్డ్ సృష్టించింది.







మరోవైపు ఇదే ఈవెంట్‌కు హాజరైన దీపిక పదుకోనే రెడ్ కార్పెట్‌పై యువరాణిలా రాజసాన్ని ఒలకబోసింది. బ్యాక్ లెస్ డ్రెస్‌లో సొగసు సోయగాల విందు వడ్డించేసింది. అందాల ఆరబోతలో పీసీ, డిప్సీలో ఎవరికి ఎవ్వరూ తీసిపోకపోయినా నెటిజన్లు మాత్రం ప్రియాంకకే పట్టం కట్టేస్తున్నారు. భారీ ట్రెంచ్ కోట్‌ను స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసిన పీసీకే ఫ్యాషన్ క్రిటిక్స్ ఎక్కువ మార్కులు వేశారు. మరి ఈ విషయంలో దీపిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.







ప్రత్యేకించి దేశీ గ‌ర్ల్ ప్రియాంకా చోప్రా వెరైటీ గౌన్‌తో మెట్ గాలా రెడ్ కార్పెట్‌ను ఓ ఊపు ఊపేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ్యాషనిస్ట్‌లు ఆమె గౌన్‌కు థ‌మ్సప్ చెప్పారు. కానీ ట్విట్ట‌ర్‌లో మాత్రం ఆమె గౌన్‌పై జోకులు పేలుతున్నాయి. 




"స్వ‌చ్ఛ‌భార‌త్" ప్ర‌చారాన్ని ప్రియాంక చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లుంది అని ఒక‌రంటే


"ఐపీఎల్ మ్యాచ్‌" ల‌కు వ‌ర్షం ప‌డినా బాధ‌ప‌డాల్సిన ప‌నిలేదు. 




ప్రియాంకా ఒక్క‌తే గ్రౌండ్ మొత్తాన్ని కవ‌ర్ చేస్తుంద‌ని మ‌రొక‌రు ఫ‌న్నీ కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు. ఆమె వేసుకున్న గౌన్ అంత పెద్ద‌గా ఉంది మ‌రి. ఈ గౌన్ వేసుకొని రావ‌డానికి ప్రియాంకా కూడా చాలానే క‌ష్ట‌ప‌డింది. అంత‌టి గౌన్‌ను ఒంటిపై మోసుకురావ‌డానికి ఇబ్బంది ప‌డింది. ఓ ప్ర‌త్యేక వాహ‌నంలో రావాల్సి వ‌చ్చింది. అంతే కాదు మెట్లు ఎక్క‌డానికి కూడా మ‌రొక‌రు సాయం చేయాల్సి వ‌చ్చింది. ఇది చూసిన నెటిజ‌న్లు ఫ‌న్నీ ట్వీట్ల‌తో పండ‌గ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ప్రియాంకా గౌనే ట్రెండింగ్ అవుతున్నది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: