యువ దర్శకుడు మృతి..!

Edari Rama Krishna
సినిమా ఇండస్ట్రీలో కొంత మంది డైరక్టర్లు కావడానికి వస్తుంటారు..కానీ వారి స్టార్ మాత్రం కలిసి రాక మద్యలోనే డ్రాప్ అవుతుంటారు.  మరి కొంత మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చి అనుకోకుండా స్టార్ కలిసి రావడంతో మంచి దర్శకులుగా గుర్తింపు పొందుతారు.  మాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోలకు దర్శకత్వం వహించిన ఘనత యువ దర్శకుడు దీపక్ చేతన్ (47) కి వచ్చింది.  మాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్ దీపక్ చేతన్ ఈ రోజు కన్నుమూశారు.  

గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అస్వస్థతో ఉన్న దీపక్ ఫిబ్రవరి 26 నుంచి కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నాడు.  అసిస్టెంట్‌ దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన ఆయన 2003లో ‘లీడర్ కింగ్ మేకర్ ' అనే పొలిటికల్ థ్రిల్లర్ ను అందించాడు. 2009 లో పృథ్విరాజ్‌ నటించిన "పుతియా ముఖం" సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.సురేష్ గోపితో డాల్ఫిన్ బార్ అనే చిత్రత తీశాడు.

చివరిసారిగా జయరామ్, రోమా జంటగా సత్య సినిమాను తీయగా, అది ఇంకా రిలీజ్ కాలేదు. కాగా, దర్శకుడి ఆకస్మిక మరణంపై మాలీవుడ్ ప్రముఖులు ఫేస్‌బుక్‌ ద్వారా విచారాన్ని వ్యక్తం చేశారు. తన కెరీర్ ఎదుగుదలకు ఎంతో సహకరించిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పృథ్వీరాజ్ తెలిపాడు. తమిళ ఇండస్ట్రీలో ఫృథ్విరాజ్  హీరోగా ఫుథియా ముఖం, డీ కంపెనీ, హీరో, లీడర్ సినిమాలకు దర్శకత్వం వహించి మంలి లైఫ్ ఇచ్చాడు.  దీపన్ చేతన్ మృతిపై మలీవుడ్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది..ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: