పవన్ డైరెక్టర్‌కు జూనియర్ వార్నింగ్
బాద్షా మూవీతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కాస్తా బాద్షా ఎన్టీఆర్‌గా మారిపోదామనుకున్నాడు. బాద్షా మూవీ రిజల్ట్స్ జూనియర్ లెక్కల్ని తారుమారు చేయడంతో, ఆ మూవీ రిలీజ్ తరువాత బాద్షా సక్సెస్ ప్రమోషన్‌ను తూతూ మంత్రంగానే పూర్తి చేశారు. ఇదంతా జూనియర్ గమనిస్తుండగానే జరిగిపోయింది. బాద్షా మూవీతో జరిగింది తప్పు అని తెలిసినా, సరిదిద్దుకోలేని పరిస్థితి.
బాద్షా మూవీ హిట్ కోసం ఎంత తాపత్రయ పడి బోల్తాపడ్డాడో, అదే తప్పును రామయ్యా..వస్తావయ్యా మూవీలో జరగకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఓ పక్క పవన్‌కళ్యాణ్ వీరాభిమాని డైరెక్టర్ హారిష్శంకర్ తన సత్తా ఏంటో చూపించటానికి పవన్ కొత్త మూవీ రిలీజ్ రోజునే ఎన్టీఆర్ మూవీ కూడ రిలీజ్ చేసేందుకు, జూనియర్‌ను ఒప్పించాడు. తీరా ఆ రోజు ఏం జరుగుతుందో ముందే తెలుసుకోని తన మూవీను మరో 20 రోజులకు పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. అంతే కాకుండా పవన్‌కళ్యాణ్ పై పోటీ పెట్టాలనుకుంటే నీ డైరెక్షన్లో మరొసారి పెట్టుకో, నీ సత్తాకు ఇది టైం కాదు అని సున్నితంగా చెప్పాడట.
బాద్షా మూవీ జూనియర్ దృష్టిలో బ్లాక్‌బస్టర్ అని నమ్ముతున్నా, ఏదో తెలియని వెలితి తనను ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుకే ఫుల్ప్లెజ్డ్ సక్సెస్ కోసం రామయ్యా..వస్తావయ్యా మూవీపై ప్రత్యేక దృష్టిని పెట్టాడు.