డైరీ మొదలు పెట్టిన ఏఎన్నాఆర్

Prasad
చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తితో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. నేడు ఆయన ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. ఒక చిన్న విషయంలోనూ ఆయన అదర్శం అయ్యారంటే విశేషమే. సినిమా పరిశ్రమలో ఒకేసారి నాలుగైదు సినిమాలకు వర్క్ చేసేవాళ్ళు ఎవరెవరికి ఏ నెలలో ఎన్ని రోజులిచ్చారో డైరీలో రాసుకుంటారు. అయితే, ఈ డైరీలో డేట్స్ రాసుకోవడం అనేదానిని ఏఎన్నార్ ప్రారంభించారట. ఆ సినిమా రంగంలో ప్రవేశించిన కొత్తలో ఈ డైరీ రాసుకునే పద్ధతి ఉండేది కాదు. అయితే అక్కినేని బిజీగా మారుతున్న కొద్ది ఆ రోజు ఏ షూటింగ్ కు వెళ్లాలో ముందుగా తెలుసుకోవడానికి డైరీ ఉపయోగించడం ప్రారంభించారు. ఇది సులువుగా అనిపించడంతో మిగిలిన నటులు కూడా డైరీ లో డేట్స్ మార్క్ చేసుకోవడం ప్రారంభించారు. అలా అక్కినేని ఆదర్శంగా నిలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: