పాపం దీక్షా

HANUMA HANUMA
 పరిశ్రమలో కొంతమందికి ఐరన్ లెగ్ అనే పేరు అట్టే మిగిలిపోతుంది. గబ్బర్ సింగ్ తో శ్రుతి, మిస్టర్ పర్ ఫెక్ట్ తో తాప్సీ ఆ పేరు నుంచి తప్పించుకుని బయటపడ్డారు. కానీ ఇంకా ఆ ఫలితం దక్కనిది దీక్షాసేథ్ కే. ఆరడుగుల హీరోల పక్కన అచ్చంగా సరిపోయే దీక్షా ఎంత ఆచితూచి అడుగులు వేసినా ఫలితం ఉండట్లేదట. ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా పరాజయమవుతున్నాయి. తాజాగా రెబెల్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే కావడంతో నటన మీద కాక, మరేదైనా బిజినెస్ మీద దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తోందట దీక్షా. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: