లక్కీ ఛాన్స్ కొట్టేసిన తాప్సీ

HANUMA HANUMA
పూరి జగన్నాథ్ సినిమా అంటేనే హీరోయిన్ కి పండగే. ఇంతకుముందు రాఘవేంద్రరావు, ఇప్పుడు పూరి జగన్నాథ్ చిత్రాల్లో నటించే అవకాశం కోసం నాయికలు ఎదురుచూస్తున్నారు. తొలి చిత్రంతోనే రాఘవేంద్రరావు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తాప్సీ ఇప్పుడు పూరి సినిమాలో నటించనుంది.  ఇటీవల ఈ అవకాశాన్ని మూటగట్టుకుంది తాప్సీ. పూరి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే అల్లు అర్జున్ సినిమాను ప్రారంభిస్తారు. ఈ సినిమాలో తాప్సీని నాయికగా ఎన్నుకున్నారు. అంటే తాప్సీ లక్కీ చాన్స్ కొట్టేసినట్టే. ఇటీవలే పుట్టిన రోజును జరుపుకున్న తాప్సీకి ఇది బర్త్ డే గిఫ్ట్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: