రజనీకాంత్ ను అనుసరిస్తున్న సూర్య

Prasad
తమిళ నటుడు సూర్య ప్రస్తుతం మాట్రాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. రంగం ఫేమ్ కె.వి.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమా ఆడియోను ఆగస్టు 9న సింగపూర్ లో విడుదల చేయడానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో రజనీకాంత్ నటించిన రోబో ఆడియోను కూడా సింగపూర్ విడుదల చేశారు. రోబో మాదిరిగానే  ఈ మాట్రాన్ కు కూడా విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశ్యంతో సింగపూర్ లో ఆడియోను విడుదల చేస్తున్నారు. కాగా, మాట్రాన్ లో కవలలుగా సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: