ప్రియమణిపై అరవింద్ నమ్మకం

Prasad
అందాల మణి ప్రియమణి మంచి నటి అని చాలా చిత్రాలతో నిరూపించబడింది. గతంలో ఆమె జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. కాగా, ప్రియమణి ప్రస్తుతం చారులత అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంలో అవిభక్త కవలలుగా ఆమె నటిస్తుంది. రెండు పాత్రలలో ఆమె అద్భుతంగా నటించిందనే టాక్ వినిపిస్తుంది. అలాగే, ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నాడు. ప్రియమణి నటన మీద నమ్మకంతోనే అరవింద్ ఈ హక్కులను తీసుకున్నాడని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: